![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1129 లో... బావ ఎలాగైనా పెళ్లి చూపులు చెడగొట్టని రంగాకి చెప్తుంది సరోజ. నేను చెయ్యలేను మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని రంగా అంటాడు. నువ్వు క్యాన్సిల్ చేయకుంటే ఏంటి నేను చేస్తానని సరోజ అంటుంది. పక్కనే గ్లాస్ లో రాయిలు వేస్తుంటుంది. వసుధార. ఏంటీ పెళ్లి చూపులు సక్సెస్ అవుతుందో లేదోనని వేస్తున్నావా అని సరోజ అడుగగా.. అవును సక్సెస్ అవుతుందని వసుధార అంటుంది.
మరొకవైపు నేను ఎండీ చైర్ గురించి ఎన్ని చేసిన అసలు పదవి దక్కడం లేదు.. జగతి పిన్ని, రిషి, వసుధారలని లేపేశాను. ఇప్పుడు అడ్డుగా ఉన్నాడని మనుని పక్కకి తప్పించాం.. అయినా ఎండీ చైర్ రావడం లేదు.. ఆ వసుధార వచ్చి చెప్పాలట చనిపోయిన వారు వచ్చి ఎలా చెప్తారని దేవయానితో శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. వాళ్ళకి చిరాకు వచ్చేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత మహేంద్రని తీసుకొని ఫణీంద్ర వస్తాడు. మహేంద్ర ఈ ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉందని దేవయాని అంటుంది. మహేంద్ర నొచ్చుకునేలా ఎవరైనా మాట్లాడితే బాగుండదని ఫణీంద్ర అంటాడు.
ఆ తర్వాత రంగా ఫ్రెండ్ ని సరోజ పిలిచి.. నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు కదా.. అది ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యాలని సరోజ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో నేనేం చేసిన రిషి సర్ ఇలాగే చేశారు అంటున్నావని వసుధారతో రంగా అనగా.. మీరే నా రిషి సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత మహేంద్ర, దేవయాని శైలేంద్ర దగ్గరికి వచ్చి.. మీరే అనుపమని ఏదో అన్నారని తెలుసని మహేంద్ర అంటాడు. అలా అంటున్నావ్ బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. అప్పుడే శైలేంద్రకి ఎమ్ఎస్ఆర్ అసిస్టెంట్ ధనరాజ్ కాల్ చేసి.. నాకు పెళ్లి విషయంలో హెల్ప్ చెయ్యాలని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |